ems logo
 

Announcements

చిన్న పత్రికలను కాపాడుకుందాం...
నేటి పోటీ ప్రపంచంలో చిన్న, మధ్యతరహా పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంతో పోల్చితే, చిన్న, మధ్యతరహా పత్రికల మనుగడ కష్టసాధ్యంగా మారింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక, ప్రయివేటు సంస్థలు ఆదరించక, నమ్ముకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు సహకరించక ‘చిన్న’ పత్రికలు పడుతున్న కష్ట, నష్టాలు పదాల్లో చెప్పలేనివి. ఈ నేపథ్యంలో ‘ఎపిఇఎంఎస్’ యాజమాన్యం తన చందాదారులను కొంత వరకైనా ఆదుకునేందుకు నడుం బిగించిందని చెప్పడానికి సంతోషిస్తూ...
మీ పత్రిక ఆర్ధిక ఎదుగుదలకు అవసరమైన మరిన్ని వివరాలకు సంప్రదించగలరు...

ఈ సదావకాశం కేవలం విలువైన ‘ఇఎంఎస్’ చందాదారులకు మాత్రమేనని గమనించగలరు.
‘ఇఎంఎస్’ అక్రమ వినియోగదారులకు నోటీసులు
శ్రమను గుర్తించి ఆదరిస్తున్న వారందరికీ మరోమారు కృతజ్ఞతలు. చిన్న, మధ్యతరహా ప్ర్రచురణకర్తల ఆర్ధిక పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించేలా ‘ఇఎంఎస్’ చేస్తున్న కృషికి ప్రధాన అడ్డంకిగా మారిన అక్రమ వినియోగదారులను నియంత్రించేందుకు సంస్థ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలను స్వాగతించిన విజ్ఞులైన ప్రచురణకర్తలకు ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు... ‘ఇఎంఎస్’ ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా మీ అందరికీ తెలియజేస్తుందని... ఈ క్రమంలోనే ‘ఇఎంఎస్’ దుర్వినియోగదారులపై చర్యలు తీసుకునే విషయాన్నీ మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అక్రమ వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలను భేఖాతరు చేసి ఇతరుల యూజర్ ఐడి ద్వారా ‘ఇఎంఎస్’ సేవలు అనధికారికంగా వినియోగించిన వారిని గుర్తించడం జరిగింది. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని మీ అందరి ద్వారా వారిని మరోసారి బహిరంగంగా హెచ్చరిస్తున్నాం. వ్యాపార దృక్పథంతో కాకుండా చిన్న పత్రికల మనుగడే లక్ష్యంగా కదులుతున్న ‘ఇఎంఎస్’ అడుగులకు ఈ అనధికార వాడకం ముళ్లబాటగా తయారయిందని మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాము చేస్తున్నది చట్టప్రకారం తీవ్రమైన నేరమని తెలియకే చాలా మంది ప్రచురణకర్తలు ఈ అక్రమ వినియోగాన్ని కొనసాగిస్తున్నట్లు భావించి స్వచ్ఛంద మార్పు కోసం ఎదురుచూసి ఇన్నాళ్లూ దీని గురించి పెద్దగా పట్టించుకోని విషయమూ మీకు తెలియందేమీ కాదు. కానీ, కొంత మంది అక్రమార్కులు అదే పనిగా తమ అనధికార వినియోగాన్ని విస్తరించి దీన్నో వ్యాపారంగా మార్చేసిన నేపథ్యంలో సంస్థ పరంగా స్పందించక తప్పడంలేదు. తాజా నిర్ణయం ప్రకారం ‘ఇఎంఎస్’ సేవలు కేవలం చందాదారులకు మాత్రమే పరిమితం. చందాదారులు మినహాయించి సంస్థ నుంచి అనుమతి లేకుండా ఇతరులెవరూ కూడా ‘ఇఎంఎస్’ సేవలు వినియోగించడాన్ని చట్ట పరిధిలో నిషేధించి, ‘ఇఎంఎస్’ వెబ్ సైట్లో ప్రత్యేక ‘నిఘా’ ఏర్పాట్లు చేయడం జరిగింది. వైబ్ సైట్లో నమోదయ్యే వాడకందారుల కంప్యూటర్ ఐ.పి. అడ్రసు (నంబర్) ఆధారంగా అనధికార వినియోగదారులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏ చందాదారుని యూజర్ ఐ.డి. నుంచి అక్రమ వినియోగం జరిగిందన్న విషయం కూడా ఐ.పి. అడ్రస్ ఫైండర్ ద్వారా స్పష్టమవుతుంది. అలా అక్రమ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలిన వారిపై కూడా సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు. దయచేసి చందాదారులు ఎవరూ కూడా తమ యూజర్ ఐడిని ఇతరులకు ఇవ్వవద్దని మనవి. చందాదారులు కాని వారికి అలా యూజర్ ఐడి ఇవ్వడం కూడా సైబర్ చట్టం ప్రకారం నేరమే అవుతుంది కాబట్టి అలా చేయవద్దని సూచిస్తున్నాం. ఆ విధంగా మూడు సార్లు తమ యూజర్ ఐడి ద్వారా ఇతరులు లాగిన్ అయినట్లు నమోదైతే సంబంధిత అకౌంట్ దానంతట అదే డీ యాక్టివేట్ అవుతుందని గమనించాలి. నెలనెలా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న సంస్థ మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన అక్రమ వినియోగ భూతంపై ప్రకటించిన ‘ఈ సమరానికి’ విజ్ఞులైన మీ అందరి సహకారం ఎంతో అవసరం. సంపూర్ణంగా చేయూతనందిస్తారని ఆశిస్తూ... ఉచిత సేవలు ఇక ఎవరికీ ఇవ్వడం లేదుకాబట్టి వినియోగదారులందరూ రాష్ట్ర చిన్న, మధ్యతరహా దినపత్రికల సంఘం సూచనను అనుసరించి చందాదారులుగా చేరుతారని ఆశిస్తున్నాం.

ఎడిటర్, యాజమాన్యం తరపున
ఇతర సమాచారానికి సంప్రదించండి...
09390556171 & 9440114786


 


Members Login


Member   |   Subscriber

 User Name

 Password
 

Not a member? Register Hereముఖ్య సమాచారం

All Copyrights reserved | Powered by ARC Technologies